విశాఖపట్నం ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ విద్యార్థులతో స్వచ్ భారత్ నిర్వహణ

09-12-2025: జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో చైతన్య మహిళా డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థినులతో గత వారంరోజులుగా నిర్వహిస్తున్న ఎన్ ఎస్ ఎస్ శిబిరం ముగింపు సందర్భంగా గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జేడీ గ్రూప్ సభ్యులు అధిల్ గారు ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి శుభ్రపరిచారు.

తదుపరి గతంలో పాఠశాల ప్రాంగణంలో తవ్విన ఇంకుడు గుంతలను చూపించి వాటి అవసరాన్ని వివరించారు. వర్షపు నీటిని భూమిలోకి చొరబాటుచేసి భూగర్భ జలాలను పెంపొందించడంలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త శ్రీమతి సంతోషినీ దేవి గారు శిబిర కార్యక్రమంలో పాల్గొన్న జేడీ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొని పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు. సమాజ శ్రేయస్సు దిశగా జేడీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader