13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్న ZPH స్కూల్ (బాయ్స్ & గర్ల్స్) లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయి నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఫిబ్రవరి నెలలో నిర్వహించే NMMS పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.15,000 చొప్పున, ఇంటర్ పూర్తి చేసే వరకు మొత్తం రూ.60,000 స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ అవకాశం ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతమైన విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
NMMS పరీక్ష ముఖ్య వివరాలు:
- అర్హత: 8వ తరగతి విద్యార్థులు
- పరీక్ష విధానం: బ్యాంకు పరీక్షల తరహా అర్థమెటిక్ & రీజనింగ్
- సిలబస్:
- గణితం
- PS & NS
- సోషల్ స్టడీస్
- జనరల్ నాలెడ్జ్

ఈ సంవత్సరం NMMS కు అప్లై చేసిన ఉభయ స్కూల్స్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, జేడీ ఫౌండేషన్ చైర్మన్, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు చొరవ తీసుకుని రెండు పాఠశాలలకు ఈ రోజు నుంచే ట్యూటర్‌ను నియమించడం జరిగింది. అలాగే విద్యార్థులు మెరుగైన సిద్ధత సాధించేందుకు NMMS మోడల్ పేపర్లు మరియు బుక్స్ కూడా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు మాట్లాడుతూ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి మెరిట్ సాధించాలని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా గర్ల్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ స్వర్ణలత గారు, బాయ్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణు గోపాల్ గారు జేడీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
- పాఠశాల ఉపాధ్యాయులు
- జేడీ ఫౌండేషన్ సభ్యులు
- జేడీ గ్రూప్ వాలంటీర్లు

విద్యే ఆయుధంగా భావించి, ప్రతిభావంతమైన విద్యార్థులకు మద్దతు అందించడమే లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలను నిరంతరం కొనసాగించనుంది.


