విశాఖపట్నం ధర్మానగర్‌లో – “స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” కార్యక్రమానికి విశేష స్పందన

01-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం వారు సమకూర్చిన వస్త్ర సంచులను పంపిణీ చేసే కార్యక్రమం ధర్మానగర్, కంచరపాలెం విన్నింగ్ గయ్స్ టీమ్ వద్ద జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భక్తులు ఇంటి నుంచి స్టీల్ కంచం తెచ్చుకుని భోజనానికి విచ్చేయగా, ఫౌండేషన్ వారు వారికి వస్త్ర సంచులు అందజేశారు.

  • స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” అనే పిలుపు ప్రకారం, ధర్మానగర్ పరిసర ప్రాంతాల వాసులు ఉత్సాహంగా స్పందించి స్టీల్ ప్లేట్లు పట్టుకుని భోజన లైన్‌లో పాల్గొన్నారు.

ఈ పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజు మరో వినూత్న కార్యక్రమం నిర్వహించబడింది.
స్థానిక 89వ వార్డు అన్నపూర్ణా కేటరింగ్ వారి ఆర్థిక సాయంతో, సంతోష్ నగర్ కాలనీలో జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంలో, భోజనానికి విచ్చేసిన భక్తులు ఇంటి నుండి స్టీల్ కంచం తెచ్చుకున్న వారికి కోరమాండల్ ఇంటర్నేషనల్ వారు సమకూర్చిన గుడ్డ సంచులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా, ఫౌండేషన్ పిలుపు —

  • ప్లాస్టిక్ ప్లేట్స్ వీడండి – స్టీల్ ప్లేట్స్ వాడండి

కు భక్తులు విశేష స్పందన చూపారు.

ప్లాస్టిక్ పొరతో కప్పబడి ఉన్న ప్లేట్స్ వల్ల కలిగే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ, అలాగే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

భోజనానికి విచ్చేసిన భక్తులు ఫౌండేషన్ చేస్తున్న ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader