విశాఖపట్నం నగరంలోని కొత్తపాలెం శివారు 89వ వార్డు ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధనుష్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుంతలు కారణంగా వాహనాలు సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యను గమనించిన జేడీ ఫౌండేషన్ సభ్యులు స్థానికుల అభ్యర్థన మేరకు తక్షణ చర్య తీసుకొని, రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. దగ్గరలో లభించిన బిల్డింగ్ మెటీరియల్ దెబ్రీస్ సహాయంతో గుంతలను పూడ్చి రహదారిని మళ్లీ సవ్యంగా మార్చే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమంలో కోత్తపాలెం బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్ శ్రీ సూరిశెట్టి చిన్నాగారు సహకరించి, ఆటో క్రషర్ పౌడర్ ను అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు ఆ పౌడర్‌తో రోడ్డును సమతలంగా చేసి, వాహన చోదకులకు సౌకర్యవంతమైన ప్రయాణ మార్గం కల్పించారు.

ఈ సేవా కార్యక్రమంలో జేడీ గ్రూప్ సభ్యులు చురుకుగా పాల్గొని, ప్రజలకు మద్దతుగా నిలిచారు. ఈ చర్యతో స్థానికులు ఫౌండేషన్ పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.




