01-06-2026 రోజు సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం 67వ వార్డు – గాజువాక హై స్కూల్ రోడ్డుపై గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం “స్వచ్ఛ్ భారత్ విత్ కార్పొరేటర్” నిర్వహించబడింది.
ఈ సందర్బంగా స్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ, “ప్లాస్టిక్ భూతాన్ని తరుముదాం! పర్యావరణాన్ని కాపాడుదాం!” అనే నినాదంతో శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు :
- స్కూల్ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు
- పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలను శుభ్రత కార్యక్రమంలో భాగం చేయడం
- చిన్నపిల్లల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడం

కార్యక్రమంలో పాల్గొన్న వారు :
- స్కూల్ టీచర్లు
- స్థానికులు
- జేడి ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు

పర్యావరణ అవగాహనకు తోడు నిలిచిన చిన్నారులు :
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు:
- సాహితీ
- హిమజ
- శామ్యూల్ గాంధీ
- లలిత ప్రసాద్
చిన్నతనంలోనే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి చూపుతూ,
“ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం – పర్యావరణాన్ని కాపాడుదాం!”
అనే నినాదంతో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం.



