విశాఖలో వంద అంకుర సంస్థలు – విద్యార్దులే పారిశ్రామికాధిపతులు విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ చొరవకు మంత్రి అమరనాథ్ అభినందన స్టార్టప్ పరిశ్రమలకు అన్ని విధాలా సహకారమందిస్తామని హామీ.

ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖ పట్నంలో వంద అంకుర సంస్థల స్ధాపన దిశగా అడుగులు పడనున్నాయి. దీనికి విశాఖ ఇన్సిట్యిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ వేదిక అయింది. సర్వజ్ఞ ఫౌండేషన్., నెంబర్ వన్ ఒటిటి., స్టార్ట్ అప్ ప్రీమియర్ లీగ్., దర్బార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్ధలు దీనికి సహకారం అందిస్తున్నాయి. నరవ లోని విశాఖ ఇన్సిట్యిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన స్టార్టప్ ప్రీమియర్ లీగ్ ఆవిష్కరణ సభలో ఆంధ్ర ప్రదేశ్ ఐ టి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ పాల్గొని ఎస్ పి ఎల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్దులలో సృజనాత్మక శక్తిని పెంపొందించి., తద్వారా అంకుర పరిశ్రమలు రావడానికి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు. విద్యార్దులే తమ ఆవిష్కరణలను ప్రదర్శించడం, వాటికి పలువురు బ్యాంకర్లు , ఆర్ధిక సంస్థలు., ప్రభుత్వం సహకారం అందిండం ఈ కార్యక్రమంలో భాగంగా జరగ డం ముదావహమన్నారు. సర్వజ్ఞ ఫౌండేషన్., విశాఖ ఇన్సిట్యిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థ ., నెంబర్ వన్ ఒటిటి.,స్టార్ట్ అప్ ప్రీమియర్ లీగ్., దర్బార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్ధలను అభినందించారు.
నిరంతరాయంగా కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఔత్సాహికులైన విద్యార్దులలో దాగి ఉన్న మేథోశక్తిని వెలికి తీసి., వారిని భావి పారిశ్రామిక వేత్తలుగా., అంకుర సంస్థల స్థాపన దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని విశాఖ ఇన్సిట్యిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థ చైర్మన్ జి. సత్యనారాయణ చెప్పారు. నెంబర్ వన్ ఒటిటి మీడియా సంస్థ సీయండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు.,స్టార్టప్ ప్రీమియర్ లీగ్ ., సర్వజ్ఞ సంస్థల వ్యవస్థాపకులు., సీఈఓ డాక్టర్. అనిల్ కుమార్ పసినిబిల్లి ( డోలోనాథ్) మాట్లాడుతూ ఈ స్టార్టప్ ఏర్పాటు దిశగా తాము సంధాన కర్తలుగా సహాయ సహకారాలు అందుస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే స్టార్టప్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సమావేశంలో భాగంగా పలువురు విద్యార్దులు తమ ఆవిష్కరణలను ఆహూతుల ముందు ఉంచారు. వాటికి పలువురు బ్యాంకర్లు., ఆర్ధిక సంస్థలు., ముంబై., చెన్నయ్., బెంగుళూరు., హైదరాబాద్., విజయవాడ., ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పారిశ్రామిక వేత్తలు విచ్చేసి పెట్టుబడులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సిబిఐ మాజీ డైరక్టర్ జె.డి లక్ష్మీనారాయణ.,పెందుర్తి ., విశాఖ సౌత్ శాసన సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్.,వాసుపల్లి గణేష్ కుమార్.,గ్రేటర్ విశాఖ మేయర్ జి. హరికుమారి., వి.ఎం .ఆర్ డి ఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల., విశాఖ డిప్యూటి మేయర్ జియ్యాని శ్రీధర్.,జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ.,ఎ.పి.ఎం.ఎస్.ఎం.ఈ .సి చైర్మన్ అడారి ఆనందకుమార్.,విజయనగరం జె ఎన్ టి యు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. వెంకట సుబ్బయ్య., ఇంకా పలువురు విద్యావేత్తలు., పారిశ్రామికాధిపతులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader