విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాలేజ్ ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులతో స్వచ్ భారత్ నిర్వహణ మరియు ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ బ్యాగ్ కార్యక్రమం

16-12-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో “ఏక్ దిన్ – ఏక్ సాత్ – ఏక్ బ్యాగ్” కార్యక్రమం మరియు స్వచ్ భారత్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ నగరంలోని మొత్తం 32 ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, నరవ, శ్రీహరిపురం, గాజువాక, కంచరపాలెం, మర్రిపాలెం, మురళీ నగర్, యల్లపువానిపాలెం, కొత్తపాలెం, చంద్రానగర్, లక్ష్మీ నగర్, నాయుడుతోట, ఆంధ్రా యూనివర్శిటీ ఏ ఐ హబ్, మల్కాపురం తదితర ప్రాంతాలలో ఫౌండేషన్ సభ్యులు విస్తృతంగా వస్త్ర సంచులు పంపిణీ చేశారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి తీవ్రంగా హానికరమని వక్తలు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకొని, వస్త్ర సంచులను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

అదే సందర్భంగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులతో కలిసి స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, పర్యావరణ రక్షణలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలియజేశారు.

స్వచ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ జేడీ ఫౌండేషన్ తరపున వస్త్ర సంచులు పంపిణీ చేయడం జరిగింది.

పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడంలో జేడీ ఫౌండేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమాలు సమాజంలో మంచి స్పందనను పొందుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader