30-06-2025 న జేడి ఫౌండేషన్ ప్రతినిధులు విశాఖపట్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమీనర్ శ్రీ కేతనకార్గ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలపై వివరణాత్మకంగా చర్చించారు.
సమావేశం సందర్భంగా:
కమీనర్ గారికి చూపిన అంశాలు :
- విద్యార్థులతో తయారు చేసిన సీడ్ బాల్స్
- “సీడ్ బ్యాంక్” బాక్స్‌లో సేకరించిన విత్తనాల నమూనాలు
- పర్యావరణ హితంగా ఉపయోగిస్తున్న క్లాత్ బ్యాగ్స్

కమీనర్ గారు ఈ కార్యక్రమాలను ఆసక్తిగా పరిశీలించి, విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. జేడి ఫౌండేషన్ చేపడుతున్న పర్యావరణ కార్యకలాపాలు నగరానికి ఎంతో మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఉత్తరాంధ్ర కన్వీనర్ వివరణ :
జేడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్
శ్రీమతి కారుమూడి అను గారు,
సంస్థ చేపడుతున్న:
- విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు
- సీడ్ బ్యాంక్ ఏర్పాట్లు
- గుడ్డ సంచుల పంపిణీ
- చెట్ల పెంపకం అవగాహన కార్యక్రమాలు
వంటి అంశాలను వివరించారు.

తదుపరి జేడి ఫౌండేషన్ సభ్యులు జీవీఎంసీ పౌర సంబంధాల అధికారి శ్రీ నాగేశ్వరరావు గారిని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
పాల్గొన్నవారు :
- జేడి ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు
ఈ సమావేశం ద్వారా భవిష్యత్‌లో జీవీఎంసీ మరియు జేడి ఫౌండేషన్ కలిసి మరిన్ని పర్యావరణ కార్యక్రమాలను చేపట్టే అవకాశంపై చర్చ జరగడం విశేషం.
