47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం టీంకు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ-2025 జాతీయ అవార్డు

15-12-2025: బెస్ట్ ప్రైవేటు సెక్టార్ ఆర్గనైజేషన్ ఇంప్లైమెంటింగ్ సి.ఎస్.ఆర్. కేటగిరీలో జాతీయ స్థాయి అవార్డును జేడీ ఫౌండేషన్ కైవసం చేసుకుంది. Public Relations Society of India (పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా – పి.ఆర్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో “Empowering Growth, Preserving Roots – The PR Vision for 2047” అనే థీమ్‌తో Dehradun (డెహ్రాడూన్), Uttarakhand (ఉత్తరాఖండ్) రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ – 2025లో జేడీ ఫౌండేషన్ ఈ ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ-2025 జాతీయ అవార్డును అందుకుంది.

డిసెంబర్ 14వ తేదీన జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తరాఖండ్ శాసనసభ గౌరవనీయ స్పీకర్ Ritu Khanduri Bhushan (శ్రీమతి రీతూ ఖండూరీ భూషణ్), ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి Ramesh Pokhriyal Nishank (డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్), పి.ఆర్.ఎస్.ఐ నేషనల్ ప్రెసిడెంట్ Ajit Pathak (డాక్టర్ అజిత్ పాఠక్) చేతుల మీదుగా జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు జాతీయ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ చైర్మన్, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు పి.ఆర్.ఎస్.ఐ అవార్డు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు జేడీ ఫౌండేషన్ చేపడుతున్న సి.ఎస్.ఆర్. కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా లభించిన గుర్తింపని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు మరియు విశాఖపట్నం ఫౌండేషన్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ, ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, పర్యావరణ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం మరింత కట్టుబాటుతో పనిచేస్తామని తెలిపారు.

జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం జేడీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలకు దారితీస్తుందని ఫౌండేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader