6 వ విశాఖ ఆర్గానిక్ మేళాలో ఆకట్టుకున్న జేడీ ఫౌండేషన్ స్టాల్

07-12-2025: డిసెంబర్ 4, 5, 6, 7 తేదీలలో నిర్వహించిన 6వ విశాఖ ఆర్గానిక్ మేళాలో జేడీ ఫౌండేషన్ వినూత్న రీతిలో స్టాల్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకుంది. ఈ మేళా Visakhapatnam (విశాఖపట్నం)లో జరిగింది.

పర్యావరణ పరిరక్షణ ఇంటినుండే ప్రారంభం కావాలనే సందేశంతో ఫౌండేషన్ “హరిత ఘర్” నమూనా ఇంటిని ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించింది. ప్రతి ఇంటిలో మిద్ది తోటలు పెంచడం, తడి-పొడి చెత్తను వేరు చేయడం, తడి చెత్తతో కంపోస్టు తయారు చేసి మిద్ది తోటల్లో వినియోగించడం వంటి అంశాలను సందర్శకులకు వివరించారు.

అదేవిధంగా వాన నీటిని ఒడిసి పట్టి ఇంకుడు గుంతలోకి మళ్లించడం, పక్షులకు ఆవాసాలు మరియు ఆహారం ఏర్పాటు చేయడం, సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి పర్యావరణ హిత చర్యలను హరిత ఘర్ నమూనాలో చూపించారు.

మేళాకు వచ్చిన పిల్లలు, పెద్దలు జేడీ ఫౌండేషన్ స్టాల్‌ను ఎంతో ఆసక్తిగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు

ఈ సందర్భంగా మేళాలో స్టాల్ కేటాయించిన జలగం కుమారస్వామి గారు, దాట్ల సుబ్రమణ్య వర్మ గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ మేళాలో పాల్గొన్న జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఈ స్టాల్ ముఖ్య పాత్ర పోషించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader