విశాఖనగరంలో శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా నగరంలో పలుచోట్ల రక్తదాన సిభిరాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు 61వ సారి రక్తదానం చేశారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన సిభిరాలను శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు సందర్శించారు, ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరాలలో పాల్గొన్న రక్తదాతలందరినీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు, అనంతరం గోపాలపట్నంలో స్థానికంగా ఉన్న పిన్నమనేని ఫంక్షన్ హాల్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ క్రమంలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారిని మరియు రక్తదానం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ విశేషంగా కృషి చేసిన పలువురు వ్యక్తులను సత్కరించారు, అనంతరం గోపాలపట్నం పరిసరాల్లో అభిమానుల సమక్షంలో మొక్కలు నాటారు,
కాగా గత కొంతకాలంగా శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ IPS గారు ఎన్నికల సంస్కరణలపై వివిధ రంగాలకు చెందిన మేధావులు మరియు ప్రజల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తూ, పలు విశ్లేషణలు, చర్చల అనంతరం ఎన్నికల విధానంలో రావలసిన అత్యంత ఆవశ్యక సంస్కరణలను ప్రతిపాదిస్తూ సంబంధిత డాక్యుమెంట్ ను పత్రికా సమక్షంలో విడుదల చేశారు.
ఈ జన్మదిన వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి జేడీ గారి అభిమానులు, మిత్రులు, JD ఫౌండేషన్ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
