24-02-2026, భద్రాచలం: స్థానిక శాంతినగర్‌లోని దివ్యాంగుల పాఠశాలలో జేడీ ఫౌండేషన్ అధినేత శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు మరియు శ్రీమతి ఊర్మిళ గారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు కంభంపాటి సురేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు అన్నదానం నిర్వహించడం విశేషం. విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమై వారి ఆశయాలు తెలుసుకుంటూ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీరంగం సంపత్, బిర్రు సుధాకర్, తాడేపల్లి రాము గార్లు, విద్యార్థినీలు, విద్యార్థులు మరియు పాఠశాల నిర్వాహకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తూ, సేవా భావంతో నిర్వహించిన ఈ వేడుకలు అందరికీ ప్రేరణగా నిలిచాయి.



