23-05-2026: వేసవి కాలంలో పక్షుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నేషనల్ హైవే అక్కయ్యపాలెం బస్ స్టాప్ (పోర్టు హాస్పిటల్ ఎదురుగా) నుండి ఎన్‌ఏడీ వరకు ఉన్న పబ్లిక్ పార్కుల్లో పక్షుల కోసం మట్టి నీటి తొట్టెలు ఏర్పాటు చేసి, వరి కంకులను కట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్కులకు విచ్చేసిన సందర్శకులకు వేసవి కాలంలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఇంటి వద్ద మట్టి నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని, వాటికి తాగునీరు మరియు ఆహారం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అవగాహన కల్పించారు.
అదేవిధంగా, పార్కుల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు మరియు వరి కంకుల నిర్వహణ బాధ్యతను ప్రతిరోజూ పార్కుకు వచ్చే సందర్శకులకు అప్పగించి, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించడంతో పాటు, చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పులను తీసుకురావచ్చనే సందేశాన్ని అందించారు.









