Environmental Initiatives

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలఏళ్ల నాటి బావిలో పూడిక తీసివేత

19-05-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నంలోని స్థానిక 89వ వార్డు, యల్లపువానిపాలెం, యల్లపువారి వీధి వద్ద ఉన్న వందల ఏళ్ల నాటి పెద్ద బావిలో పూడిక తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బావిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, గాజు సీసాలు మరియు ఇతర వ్యర్థాలను పని చేసే సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు, జేడీ ఫౌండేషన్ సభ్యులు కలిసి తొలగించారు. బావిని శుభ్రపరచడం ద్వారా భూగర్భ జలాల నిల్వ …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలఏళ్ల నాటి బావిలో పూడిక తీసివేత Read More »

ఫౌండేషన్ సభ్యులు తయారు చేసిన వాటర్ డ్రమ్

26-04-2026: వేసవి కాలంలో మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ జేడీ ఫౌండేషన్ సభ్యులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. గతంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు మండు వేసవి ప్రభావం వల్ల నీటి అవసరం పెరగడంతో, వాటికి సులభంగా నీటిని అందించేందుకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా వాటర్ డ్రమ్ తయారు చేశారు. ఈ రోజు ఆ వాటర్ డ్రమ్‌ల సహాయంతో వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలకు నీటిని అందించడం జరిగింది. దీంతో ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నీటిని తీసుకెళ్లి …

ఫౌండేషన్ సభ్యులు తయారు చేసిన వాటర్ డ్రమ్ Read More »

ఏపుగా పెరుగుతున్న మొక్కలు

18-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ నెలలో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీ ప్రాంగణంలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గత సంవత్సరం చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమం ఫలితంగా నాటిన మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి, పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ రోజు అవి బలంగా పెరిగి నీడను అందించే …

ఏపుగా పెరుగుతున్న మొక్కలు Read More »

ఆంధ్రా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో వాడిన పెన్ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసిన జేడీ ఫౌండేషన్

16-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో పెన్ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు మరియు పరిశోధకులు అధికంగా వినియోగించే లైబ్రరీ ప్రాంగణంలో వాడిన పెన్నులను బహిరంగ ప్రదేశాల్లో పడవేయకుండా, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలని అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లైబ్రేరియన్ ప్రొఫెసర్ ఆచార్య సి.హెచ్. శ్రీనివాసరావు గారి సమక్షంలో …

ఆంధ్రా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో వాడిన పెన్ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసిన జేడీ ఫౌండేషన్ Read More »

స్వచ్ భారత్ మరియు జలమే జీవం కార్యక్రమం

12-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ భారత్ మరియు “జలమే జీవం” కార్యక్రమం నిర్వహించబడింది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మరియు జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు, గోపాలపట్నం – సింహాచలం రోడ్డులో పవన్ రెసిడెన్సీస్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటగా ఆ ప్రాంతంలో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించి, కొండ మరియు రక్షణ …

స్వచ్ భారత్ మరియు జలమే జీవం కార్యక్రమం Read More »

ఆదిత్య డిగ్రీ కాలేజీకి పెన్ డ్రాప్ బాక్స్‌లు అందజేసిన జేడీ ఫౌండేషన్

09-04-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Stop Landfill – Drop Used Pens Here” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గోపాలపట్నంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీకి పెన్ డ్రాప్ బాక్స్‌లు అందజేయడం జరిగింది. వాడేసిన పెన్నులను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాలలో పడవేయడం వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌తో తయారయ్యే ఈ పెన్నులు సహజంగా కరగకపోవడంతో భూమి కాలుష్యానికి కారణమవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జేడీ ఫౌండేషన్ ప్రత్యేకంగా …

ఆదిత్య డిగ్రీ కాలేజీకి పెన్ డ్రాప్ బాక్స్‌లు అందజేసిన జేడీ ఫౌండేషన్ Read More »

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి గృహం దర్శించిన జీవీఎంసీ అధికారులు

07-04-2026: ఈ రోజు 89వ వార్డు పర్యటనలో భాగంగా జీవీఎంసీ అధికారులు జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి స్వగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అధికారులు పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీ నల్లనయ్య గారు, ఏఎంహెచ్‌ఓ శ్రీ కృష్ణంరాజు గారు, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రామకృష్ణ గారు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. …

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి గృహం దర్శించిన జీవీఎంసీ అధికారులు Read More »

ఏజ్ కేర్ ఫౌండేషన్ గంభీరం ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్

14-11-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంభీరం ప్రాంతంలో గల Age Care Foundation (ఏజ్ కేర్ ఫౌండేషన్) ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం మరియు గౌ ఆధారిత వ్యవసాయం గురించి ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రంలో వంగ, టమాటో, మిరప వంటి కూరగాయల మొక్కలను విద్యార్థుల చేత నాటించారు. ప్రకృతి అనుకూల పద్ధతుల్లో సాగు చేసే విధానాలు, పర్యావరణానికి మేలు చేసే …

ఏజ్ కేర్ ఫౌండేషన్ గంభీరం ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ Read More »

loader