వంద సంవత్సరాల మామిడి వృక్షానికి సంరక్షణ చర్యలు

07-05-2026: గోపాలపట్నం బాలికొన్నత పాఠశాల ఆవరణలో ఉన్న సుమారు వంద సంవత్సరాల నాటి మామిడి వృక్షాన్ని సంరక్షించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, డై బ్యాక్ (Die Back) తెగులు సోకిన ఈ చారిత్రక వృక్షాన్ని కాపాడేందుకు నిపుణుల సూచనల మేరకు సహజసిద్ధమైన పద్ధతులతో దశలవారీగా సంరక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. వృక్షం ఆరోగ్యాన్ని పునరుద్ధరించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


02-05-2026: డై బ్యాక్ తెగులు సోకిన శత వయస్సు గల మామిడి వృక్షానికి సంరక్షణ చర్యల్లో భాగంగా, నిపుణుల సలహా మేరకు పులియబెట్టిన పెరుగును నీటిలో కలిపి వృక్షం మొదట పోయడం జరిగింది.

ఇప్పటికే మూడు రోజుల క్రితం ఇదే వృక్షానికి ద్రవ జీవామృతాన్ని అందించడం జరిగింది. సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా వృక్ష ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టబడ్డాయి.


07-05-2026: వృక్ష సంరక్షణ కార్యక్రమంలో తదుపరి దశగా ఈ రోజు మామిడి వృక్షానికి రెండవ దఫా ద్రవ జీవామృతాన్ని అందించడం జరిగింది.

గతంలో మొదటి దఫా జీవామృతంతో పాటు పుల్లటి మజ్జిగను కూడా వృక్షం మొదట పోయడం జరిగింది. నిపుణుల సూచనల మేరకు కొనసాగుతున్న ఈ సంరక్షణ చర్యలు వృక్షం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, తెగులు ప్రభావాన్ని తగ్గించడంలో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రకృతి వారసత్వంగా నిలిచిన విలువైన వృక్షాలను సంరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం మరియు భావితరాలకు ఆరోగ్యవంతమైన ప్రకృతి సంపదను అందించడం లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader