సమాజ సేవలో మరో అడుగు ముందుకు వేసిన జేడీ ఫౌండేషన్, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో గాజువాక బీసీ రోడ్డులో అరుణ లాడ్జి ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సీబీఐ మాజీ జేడీ శ్రీ వి వి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది.
ముఖ్య అతిథి సందేశం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాజువాక CI శ్రీ పార్థసారథి గారు, ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అనుగారు మాట్లాడుతూ,
“సమాజ సేవలో జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది” అని తెలిపారు.
చలివేంద్రం ప్రారంభానికి ముందు, సమయాన్ని వినియోగించుకుంటూ గ్రూప్ సభ్యులు —
అదిల్ గారు, భూషణం మాస్టారు, చిన్నారి సాహితీ తదితరులు
“ప్రాణం విలువ తెలుసుకో – హెల్మెట్ పెట్టుకో” అనే నినాదంతో
చిన్నారులతో కలసి వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఇది ఫౌండేషన్ యొక్క ప్రజా చైతన్య ప్రయత్నాల్లో భాగం.

