జన్మదినం సందర్బంగా 62వ సారి రక్తదానం చేసిన ఫౌండేషన్ ఛైర్మన్

03-04-2026: జెడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారు తన జన్మదినం సందర్భంగా సమాజ సేవలో మరో విశిష్ట ఘట్టాన్ని నమోదు చేశారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన యశోద హాస్పిటల్‌లో 62వ సారి రక్తదానం చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పారు.

రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. ఆయన సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులకు మరియు యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

అదే రోజు, ఛైర్మన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జెడి ఫౌండేషన్ సభ్యులు పిల్లలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, సమాజ సేవతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రక్తదానం మరియు మొక్కల నాటడం వంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారు సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఫౌండేషన్ సభ్యులు అభినందించారు.

జెడి ఫౌండేషన్ సమాజ శ్రేయస్సు, ఆరోగ్య అవగాహన మరియు పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader