07-01-2026: జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు భద్రాచలం పట్టణంలోని శ్రీవిద్య పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా స్వాగతం పలికింది.
కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ గారు విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదవడం మరియు సమాజ పట్ల బాధ్యత భావన కలిగి ఉండాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాని సాధన కోసం నిరంతర ప్రయత్నం చేయాలని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.

అనంతరం పాఠశాల యాజమాన్యం మరియు పట్టణ ప్రముఖులు కలిసి శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారిని శాలువా మరియు మొమెంటోతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవిద్య పాఠశాల సిఇవో శ్రీ కృష్ణ చైతన్య, ప్రిన్సిపాల్ శ్రీమతి వి. హన్సి, కంభంపాటి సురేష్, అడుసుమిల్లి జగదీష్, జోనల్ ఇంచార్జ్ సాయికృష్ణ, ఏజియం రవీంద్రనాధ్, స్వప్న, ప్రముఖ కాంట్రాక్టర్ అలీంఖాన్, యశోద, నగేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే విధంగా జరిగిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంది. విద్యా రంగంలో సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న జేడీ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఇది మరొక ప్రేరణాత్మక ఘట్టంగా నిలిచింది.






