28-02-2026: తణుకు పట్టణంలోని విహాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐఐటి-జేఈఈ, నీట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ మరియు అవగాహనా సదస్సు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ విద్యా అవకాశాలు, వివిధ కోర్సులు, మరియు వాటికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన విధానం గురించి ఆయన సమగ్రంగా వివరించారు.

ఇంజనీరింగ్, ఐఐటి మరియు నీట్ వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల మరియు సరైన మార్గదర్శకత్వం అవసరమని ఆయన తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని, సమయపాలనతో కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
ఈ అవగాహనా సదస్సు ద్వారా విద్యార్థులకు భవిష్యత్‌పై స్పష్టత కలిగించడంతో పాటు, సరైన దిశలో ముందుకు సాగేందుకు ప్రేరణ కలిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
