విశాఖపట్నంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టి సారించిన జేడీ ఫౌండేషన్

జల సాక్షరతకు పురోగమనంగా, విశాఖపట్నంలోని ఈస్ట్ పార్క్ పరిసరాల్లో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమం నిర్వహించబడింది. నీటి సంరక్షణపై ప్రజలలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

     ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, JD ఫౌండేషన్ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణపై తమ మద్దతును తెలియజేశారు.

     “నీటి యొక్క విలువను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భవిష్యత్ తరాలకు మంచి వనరులు అందించాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి,” అని జేడీ నారాయణ అన్నారు.

    ప్రకృతి పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, నీటి కొరత నివారణలో ప్రధాన పాత్ర పోషించనుంది. JD ఫౌండేషన్ ఈ ప్రయత్నాలను మరింత విస్తృతంగా చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

loader