నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, పచ్చలనడ్కుడా గ్రామంలో మరొక నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంభం

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లాలోని పచ్చలనడ్కుడా గ్రామంలో కాళోజి గ్రంథాలయం ఈరోజు ప్రారంభమైంది. ఇది గ్రామ ప్రజలకు ఞానదీపికగా నిలవనుంది.

ఈ గ్రంథాలయం శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మరియు జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ గారి సౌజన్యంతో ప్రారంభించబడింది. గ్రామీణ ప్రాంతాలలో విద్యా వైపుల్యాన్ని తొలగించాలనే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన ఉద్యమానికి ఇది మరో మైలురాయి.

ప్రారంభోత్సవ విశేషాలు:

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు:

  • శ్రీ అన్వేష్ రెడ్డి సుంకెట – తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
  • శ్రీ అంతిరెడ్డి రాజారెడ్డి – జిల్లా గ్రంథాలయాధికారి
  • శ్రీమతి పింగిళి కవితా రెడ్డి – జేడీ ఫౌండేషన్ తెలంగాణ కన్వీనర్
  • గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువత, గ్రామ ప్రజలు

వక్తలు మాట్లాడుతూ,

“ఈ గ్రంథాలయాన్ని గ్రామ యువత గమనించి, ఉపయోగించుకొని వివిధ అంశాల్లో అవగాహన పెంచుకోవాలి.”

“ఇది ఒక్కరినిది కాదు – గ్రామస్తులందరి సహకారంతో నడిపే జ్ఞాన మందిరంగా అభివృద్ధి చెందాలి.”

గ్రామ పెద్దలు జేడీ ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు.

జ్ఞానం కోసం ప్రతి గ్రామానికో గ్రంథాలయం అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న జేడీ ఫౌండేషన్ – గ్రామీణ విద్యా వికాసానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఈ ఉద్యమం ఇంకెన్నో గ్రామాలలో ఆశలకిరణంగా మారాలని కోరుకుందాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader