మన చెరువు మన బాధ్యత

16-05-2026: పర్యావరణ పరిరక్షణ మరియు నీటి వనరుల సంరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ నరసింహా యువజన రజక సేవా సంఘం సహకారంతో గోపాలపట్నం హైస్కూల్ గేట్ సమీపంలోని రజక కాలనీ చెరువు వద్ద “మన చెరువు – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి, చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు మరియు ఇతర చెత్తను పెద్ద ఎత్తున తొలగించారు. చెరువును పరిశుభ్రంగా ఉంచడం ద్వారా రాబోయే వర్షాకాలంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడేలా చర్యలు చేపట్టారు.

గోపాలపట్నం పరిసర ప్రాంతాలకు ఈ చెరువు ఒక ముఖ్యమైన నీటి వనరుగా ఉన్నందున, దానిని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీ నరసింహా యువజన రజక సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ అప్పారావు గారు, ఉపాధ్యక్షుడు శ్రీ నరసింగరావు గారు, కార్యదర్శి శ్రీ అప్పలరాజు గారు, ఉప కార్యదర్శి శ్రీ కళ్యాణ్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కనకరాజు గారు, క్యాషియర్ శ్రీ కనకరాజు గారు, జేడీ గ్రూప్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader