01-01-2026: నూతన సంవత్సరం సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యులు విశాఖ నగరంలోని పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారిని, జీవీఎంసీ కో-ఆప్షన్ సభ్యులు శ్రీ బెహరా భాస్కరరావు గారిని, స్థానిక 89వ వార్డు కార్పొరేటర్ శ్రీ దాడి వెంకట రమేష్ గారిని, సేవ్ టెంపుల్స్ ప్రతినిధి శ్రీ పిన్నమనేని శ్రీనివాస్ గారిని, కారుమూడి అను గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు సేవా కార్యక్రమాలలో పరస్పర సహకారం కొనసాగించాలని ఈ సందర్భంగా సభ్యులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని నూతన సంవత్సరాన్ని సేవా సంకల్పంతో ఆహ్వానించారు.



