మల్కాపురం పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయంలో పొలంబడి

07-01-2026: మల్కాపురం పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల భాగస్వామ్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమం ప్రగతిపథంలో కొనసాగుతోంది.

నవంబర్ 2025లో మున్నా గ్రూప్ సభ్యులు మరియు పాఠశాల లైబ్రేరియన్ శ్రీ జగన్ మోహన్ గారి సమన్వయంతో జేడీ ఫౌండేషన్ నుండి వంకాయ, టమాటో, క్యాబేజీ, కాలిఫ్లవర్ తదితర కూరగాయల నారును తీసుకుని పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి నాటడం జరిగింది.

ఈ రోజు ఆ మొక్కలను విద్యార్థులు ప్రేమతో సంరక్షిస్తూ ఉన్న దృశ్యాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. నీరు పోయడం, మట్టి చల్లడం, మొక్కల ఎదుగుదలను పరిశీలించడం వంటి పనులను విద్యార్థులు బాధ్యతగా నిర్వహిస్తున్నారు.

గతంలో కూడా ఈ పాఠశాలలో పొలంబడి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి మంచి దిగుబడిని సాధించిన విషయం తెలిసిందే. పాఠశాల ప్రాంగణంలో పండిన కూరగాయలు విద్యార్థులకు ప్రకృతి పట్ల అవగాహనను పెంపొందించడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కూడా ప్రోత్సహిస్తున్నాయి.

ప్రకృతి పరిరక్షణ, స్వయంపోషకత, పర్యావరణ చైతన్యం వంటి విలువలను విద్యార్థుల్లో నాటడంలో ఈ కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి జేడీ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొక్కలను ప్రేమతో సంరక్షిస్తున్న విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader