31-05-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న విత్తన బంతుల (Seed Balls) కార్యక్రమం కోసం వివిధ రకాల విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి మరియు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అవసరమైన విత్తనాలను గ్రూప్ సభ్యులు సేకరించారు.
ఈ సందర్భంగా గంగరావి, బాదం, టూబాబియా, ఆముదం తదితర వృక్షాల విత్తనాలను సేకరించి, వాటిని విత్తన బంతుల తయారీకి సిద్ధం చేశారు. వర్షాకాలంలో ఈ విత్తన బంతులను వివిధ ప్రాంతాల్లో విసరడం ద్వారా మొక్కల పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రకృతి సమతుల్యతను కాపాడడం, పచ్చదనాన్ని పెంపొందించడం మరియు భావితరాలకు హరిత వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో జేడీ ఫౌండేషన్ చేపడుతున్న విత్తన బంతుల కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఫౌండేషన్ సభ్యులు పిలుపునిచ్చారు.



