agriculture

“సేవ్ బర్డ్స్,సేవ్ నెచర్”

 “నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్” ఆంధ్రప్రదేశ్ ,సంకల్ప ఆర్ట్ విలేజ్ సంయుక్తంగా పండ్ల, పూల మొక్కలపై నిర్వహించిన గ్రాఫ్టింగ్ వర్కుషాప్ లో పాల్గొని ,”సేవ్ బర్డ్స్,సేవ్ నెచర్” కార్యక్రమంలో భాగంగా సంకల్ప ఆర్ట్ విలేజ్ ప్రాంగణంలో పక్షుల కొరకు మట్టి పాత్రలలో నీరుపోసి చెట్లకు కట్టడం జరిగింది.  ఈకార్యక్రమంలో ఆకుల చలపతిరావు గారు, పిన్నమనేని శ్రీనివాస్ గారు ,దాట్ల వర్మ గారు,రవి గార్డెన్స్ అధినేత రవి గారు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ ,గోపాలపట్నం, విశాఖపట్నం.🦜🦜🌳🌳🌳🌳🌳

“రైతే రాజు – గ్రామ స్వరాజ్యమే ధ్యేయం”

         “జాతిపిత మహాత్మా గాంధీ” గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే, స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు, నిధులు ఇవ్వాలి. రాబోయే పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తిగల అభ్యర్థులకు Join for Development Foundation తరపున 2 రోజుల అవగాహన సదస్సు హైదరాబాదులో నిర్వహించడం జరిగింది.  

“జేడి పౌండేషన్ పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు”

జేడి పౌండేషన్ వ్యవస్థాపకులు CBI మాజీ JD శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు బుడంపాడు గ్రామం, కర్నూలు జిల్లాల్లో,ఇరుసుమండ తూర్పు గోదావరి జిల్లాల్లో ,ఎల్లందు గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు గ్రామంలో,తిరుపతి రూరల్ పాడిపేట గ్రామంలో, కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో,కర్నూలు జిల్లా బుక్కాపురం గ్రామంలో , స్వాతంత్ర దినోత్సవం సందర్భంగ రైతులు పంట పొలం లో జాతీయ జండాను ఎగురవేయడం జరిగింది.      

“రైతులకు మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మద్దతు”

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం లోనే అమరావతి రైతులకు మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రైతుల మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో జేడి ఫౌండేషన్ కన్వీనర్ మాకినేని అరుణ ,గాజుల సాగర్, సీనియర్ రిపోర్టర్ ప్రతాపరెడ్డి, సామాజికకార్యకర్త మలకొందారెడ్డి, ఉమెన్ ఫోర్స్ సభ్యులు ప్రభావతి, ముస్లిం వెల్ఫేర్ ఫెడరేషన్ మెంబర్, పర్వీన్,సుమతి లత గారు పాల్గొన్నారు. .

“రైతు దేవో భావః”

మాజీ సీబీఐ జెడి శ్రీ వి.వి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో నడుస్తున్న “జెడి ఫౌండేషన్ మరియు కోనసీమ ఆహారనిధి” ఆధ్వర్యంలో, కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం,ఇరుసుమండ గ్రామంలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతు పూజోత్సవం నిర్వహించారు. ఆహారనిధి వ్యవస్థాపక అధ్యక్షడు వీరంశెట్టి సతీష్ రైతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి,రైతులకు సన్మానం చేసి మిఠాయిలు అందించారు. రైతు సంక్షేమంగా ఉంటేనే, దేశం సుభిక్షంగా ఉంటుందని ,అన్నదాతకి వెన్నుదన్నుగా అందరూ నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వీరంశెట్టి …

“రైతు దేవో భావః” Read More »

loader