helpinghands

“ప్రమాదకరంగా ఉన్న ఫుట్ పాత్ ను రిపేర్ చేసిన జేడి ఫౌండేషన్”

  నిన్న” విశాఖప్నంలోని సింహాచలం ప్రాంతం సింహపురి కాలనీ”  BRTS రోడ్డు లో, నిత్యం అనేకమంది పాదచారులు ఉదయం మరియు సాయంత్రం వినియోగించే నడకమార్గం (ఫుట్ పాత్) ఒక చోట ప్రమాదకర పరిస్తితిలో ఉండటం జేడీ ఫౌండేషన్ గమనించడం జరిగింది, సంస్థ సభ్యుడు “సిడగం నాగేంద్రబాబు” GVMC వారి అనుమతి తీసుకొని స్వయంగా జేడీ ఫౌండేషన్ స్వంత ఖర్చుతో రిపేర్ వర్క్ చేయడం జరిగింది, కాగా అనేక మంది పాదచారులు, స్థానికులు జేడీ ఫౌండేషన్ కృషిని ప్రశంసించారు.

“JD FOUNDATION Summer Camp”.

     జేడీ ఫౌండేషన్ సమ్మర్ క్యాంప్ (“జోయ్ ఆఫ్ లివింగ్” లో భాగంగా)  ఈరోజు మా లిటిల్ సోల్జర్స్  బ్రిడ్జి కింద నివాసం ఉండే వారికి ఫుడ్ డొనేట్ చేసారు…ఈ ఆహారాన్ని పిల్లలే స్వయంగా వారి ఇంటి వద్ద నుండి తెచ్చారు..ఒక్కొక్కరు రెండేసి ఫుడ్ ప్యాకెట్లు తెచ్చారు. పిల్లల ఎనర్జీ కి కొలమానమే లేదు..ఎండలో కేరింతలు కొడుతు పాటలు పాడుతూ ఉత్సాహంగా ఫుడ్ డొనేట్ చేసారు. పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపటం అదృష్టం గా భావిస్తున్నాను …

“JD FOUNDATION Summer Camp”. Read More »

“రైతే రాజు – గ్రామ స్వరాజ్యమే ధ్యేయం”

         “జాతిపిత మహాత్మా గాంధీ” గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే, స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు, నిధులు ఇవ్వాలి. రాబోయే పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తిగల అభ్యర్థులకు Join for Development Foundation తరపున 2 రోజుల అవగాహన సదస్సు హైదరాబాదులో నిర్వహించడం జరిగింది.  

పేద విద్యార్థి చదువుకి “జేడీ అండ”

పేద విద్యార్థి చదువుకి “జేడీ అండ”. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధి యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజు చెల్లించిన జేడీ ఫౌండేషన్.                             సారపక గ్రామానికి చెందిన నిరుపేద పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి పోలిశెట్టి ప్రమోద్ కుమార్ సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ బీహార్ నందు ఎమ్మెస్సీ ఫిజిక్స్ సెమిస్టర్ ఫీజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెల్లించారు.    

loader