jdfoundation

“ఆద్య ఆర్గానిక్ షాప్”

“జేడీ ఫౌండేషన్” సభ్యులు స్వాతి,శిరీష,అశ్విని నూతనంగా యాండాడ లో స్థాపించిన “ఆద్య ఆర్గానిక్ షాప్” ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జెడి శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా జేడీ గారు మాట్లాడుతూ మహిళలు వ్యాపారరంగంలో రాణించడం శుభపరిణామం అని సేంద్రీయ పద్దతిలో పండించిన ఆహార పదార్థాలు విక్రయం పెరగాలని ఆకాంక్షించారు , ఈ కార్యక్రమంలో స్థానికులు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.           జేడీ …

“ఆద్య ఆర్గానిక్ షాప్” Read More »

“స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని నేషనల్ యూత్ డే”

           విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో జరిగిన స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని నేషనల్ యూత్ డే సందర్భంగా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీబీఐ మాజీ జెడి” శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు” వివిధ విద్యాసంస్థల నుండి వేలాదిమంది పాలోన్న విద్యార్థినీ విద్యార్థులకు వివేకానందుడు చేసిన కొన్ని సందేశాలు వినిపించడం జరిగింది ఈకార్యక్రమంలో ఎం.సత్యనారాయణ రాజు గారు,ఆర్ కె మిషన్ సెక్రటరీ స్వామి …

“స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని నేషనల్ యూత్ డే” Read More »

“రాష్ట్రంలో అతి పెద్ద స్టీల్ కర్మాగారం విశాఖ ఉక్కు”

రాష్ట్రంలో అతి పెద్ద స్టీల్ కర్మాగారం విశాఖ ఉక్కు పరిశ్రమ ఎన్నో ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో, వేల మంది రైతులు భూ త్యాగాలతో అప్పటి ప్రధాని ఇందిరమ్మ పై రాష్ట్ర నాయకులు ఏకతాటిపై కి వచ్చి పట్టు పట్టి దక్కించుకున్నాం. అంత చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరణ చేస్తోంది. ఆ నిర్ణయని వెతిరేకిస్తూ పరిశ్రమను కాపాడుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు ప్రజా సంఘాలు, నాయకులు, రాజకీయ పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి. …

“రాష్ట్రంలో అతి పెద్ద స్టీల్ కర్మాగారం విశాఖ ఉక్కు” Read More »

“వరల్డ్ హెల్త్ డే”

        వరల్డ్ హెల్త్ డే సందర్భంగా “శ్రీ జేడి లక్ష్మీనారాయణ” గారు ఎస్ ఎల్ జి హాస్పిటల్ లో సీనియర్ సిటిజన్స్ కి గోల్డ్ హెల్త్ ఏజ్ ప్యాకేజ్ నీ ప్రారంభించడం జరిగింది. ఇందులో ఉచితంగా RBS, X-RAY Chest, ECG, 2D ECHO, BMD BOTH HIPS, Cardiology Consultation & General medical consultation ఉన్నాయి.

“ప్రాణదాత కు సెల్యూట్”

ట్రాఫిక్ కానిస్టేబుల్ ని సన్మానించిన జేడీ లక్ష్మీనారాయణ. ఆపత్కాలం లో సాటి మనిషి ని ఆదుకోవడం కి మించిన మానవత్వం లేదని, అటువంటి వారు అందరూ మహానుభావులే అని తెలిపారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ మేరకు ఇటీవల అత్తాపూర్ దగ్గర బాలాజీ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండె నొప్పి తో పడిపోతే ,అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ తక్షణమే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే,ఇటువంటి గొప్ప మానవతా మూర్తి …

“ప్రాణదాత కు సెల్యూట్” Read More »

“సామాజిక చేయూత కార్యక్రమం”

విజయనగరం జిల్లా దేవునికొల్లం గ్రామంలో సారధి సంక్షేమ సంఘం  వసతి గృహంలో “జేడీ ఫౌండేషన్” అధ్వర్యంలో నిర్వహించిన “సామాజిక చేయూత కార్యక్రమం” కు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆహుతులకు ప్రేరణ కలిగించే ప్రసంగం చేయటంతోపాటు వారి చేతుల మీదుగా వసతి గృహం లో ఉన్నవాళ్ళకి నిత్యావసర సరుకులు మరియుదుస్తులుఅందించడం జరిగింది.  

61వ సారి రక్తదానం చేసిన శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు

విశాఖనగరంలో శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా నగరంలో పలుచోట్ల రక్తదాన సిభిరాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు 61వ సారి రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన సిభిరాలను శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు సందర్శించారు, ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరాలలో పాల్గొన్న రక్తదాతలందరినీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు, అనంతరం గోపాలపట్నంలో స్థానికంగా …

61వ సారి రక్తదానం చేసిన శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు Read More »

“ప్రమాదకరంగా ఉన్న ఫుట్ పాత్ ను రిపేర్ చేసిన జేడి ఫౌండేషన్”

  నిన్న” విశాఖప్నంలోని సింహాచలం ప్రాంతం సింహపురి కాలనీ”  BRTS రోడ్డు లో, నిత్యం అనేకమంది పాదచారులు ఉదయం మరియు సాయంత్రం వినియోగించే నడకమార్గం (ఫుట్ పాత్) ఒక చోట ప్రమాదకర పరిస్తితిలో ఉండటం జేడీ ఫౌండేషన్ గమనించడం జరిగింది, సంస్థ సభ్యుడు “సిడగం నాగేంద్రబాబు” GVMC వారి అనుమతి తీసుకొని స్వయంగా జేడీ ఫౌండేషన్ స్వంత ఖర్చుతో రిపేర్ వర్క్ చేయడం జరిగింది, కాగా అనేక మంది పాదచారులు, స్థానికులు జేడీ ఫౌండేషన్ కృషిని ప్రశంసించారు.

“కోనసీమ ఆహారనిధి మరియు జేడి ఫౌండేషన్ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం”

5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత “మజ్జిగ చలివేంద్రం” ఈరోజు అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో వీరంశెట్టి రాంబాబు, వీరంశెట్టి సతీష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాలుగా కోవిడ్ లాంటి విపత్తులలో కూడా కోనసీమ ఆహారనిధి & జేడి ఫౌండేషన్ మజ్జిగ చలివేంద్రం నిర్వహించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు “వీరంశెట్టి సతీష్” తెలియచేశారు.     ఈ కార్యక్రమంలో కిరణ్ చీకట్ల,క్రాంతి, దర్నాల ధన, సిడ్డబతుల రమేష్, రంకిరెడ్డి శ్రీనివాస్,రమేష్, వీరంశెట్టి వెంకటేశ్వరరావు,చంటి పాల్గొన్నారు

loader