socialservice

“గంగవరం పోర్ట్ సమస్యలపై సమావేశం”

 “గంగవరం పోర్టు ఎంప్లాయిస్ యూనియన్” వారు మాజీ సీబీఐ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ IPS వారిని అతని నివాసంలో కలిసి గంగవరం పోర్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను జేడీ గారి దృష్టికి తీసుకువచ్చారు, వారు తమ జీతబత్యాలు, వైద్య సౌకర్యాలు మొదలగు అంశాలపై వి.వి.లక్ష్మీనారాయణ IPS వారికి వినతిపత్రం అందజేశారు, ఆయా సమస్యలను సవివరంగా తెలుసుకున్న వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి డిమాండ్ల సాధనకు కృషిచేస్తానని తెలియజేశారు.

“కోనసీమ ఆహారనిధి మరియు జేడి ఫౌండేషన్ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం”

5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత “మజ్జిగ చలివేంద్రం” ఈరోజు అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో వీరంశెట్టి రాంబాబు, వీరంశెట్టి సతీష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాలుగా కోవిడ్ లాంటి విపత్తులలో కూడా కోనసీమ ఆహారనిధి & జేడి ఫౌండేషన్ మజ్జిగ చలివేంద్రం నిర్వహించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు “వీరంశెట్టి సతీష్” తెలియచేశారు.     ఈ కార్యక్రమంలో కిరణ్ చీకట్ల,క్రాంతి, దర్నాల ధన, సిడ్డబతుల రమేష్, రంకిరెడ్డి శ్రీనివాస్,రమేష్, వీరంశెట్టి వెంకటేశ్వరరావు,చంటి పాల్గొన్నారు

loader