team jd

” పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం”

“పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం” – జేడీ లక్ష్మీ నారాయణ గారు  పుస్తక పఠనం ద్వారా మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఆలోచనల పెంపునకు మార్గం సుగమం చేస్తుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జె డి లక్ష్మీనారాయణ అన్నారు. విశాలాంధ్ర విశాఖ 21 వ పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ఆయన ఆదివారం సాయంత్రం సదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక యుగంలో అడుగుపెట్టి …

” పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం” Read More »

“సేవ్ బర్డ్స్,సేవ్ నెచర్”

 “నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్” ఆంధ్రప్రదేశ్ ,సంకల్ప ఆర్ట్ విలేజ్ సంయుక్తంగా పండ్ల, పూల మొక్కలపై నిర్వహించిన గ్రాఫ్టింగ్ వర్కుషాప్ లో పాల్గొని ,”సేవ్ బర్డ్స్,సేవ్ నెచర్” కార్యక్రమంలో భాగంగా సంకల్ప ఆర్ట్ విలేజ్ ప్రాంగణంలో పక్షుల కొరకు మట్టి పాత్రలలో నీరుపోసి చెట్లకు కట్టడం జరిగింది.  ఈకార్యక్రమంలో ఆకుల చలపతిరావు గారు, పిన్నమనేని శ్రీనివాస్ గారు ,దాట్ల వర్మ గారు,రవి గార్డెన్స్ అధినేత రవి గారు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ ,గోపాలపట్నం, విశాఖపట్నం.🦜🦜🌳🌳🌳🌳🌳

“ప్రమాదకరంగా ఉన్న ఫుట్ పాత్ ను రిపేర్ చేసిన జేడి ఫౌండేషన్”

  నిన్న” విశాఖప్నంలోని సింహాచలం ప్రాంతం సింహపురి కాలనీ”  BRTS రోడ్డు లో, నిత్యం అనేకమంది పాదచారులు ఉదయం మరియు సాయంత్రం వినియోగించే నడకమార్గం (ఫుట్ పాత్) ఒక చోట ప్రమాదకర పరిస్తితిలో ఉండటం జేడీ ఫౌండేషన్ గమనించడం జరిగింది, సంస్థ సభ్యుడు “సిడగం నాగేంద్రబాబు” GVMC వారి అనుమతి తీసుకొని స్వయంగా జేడీ ఫౌండేషన్ స్వంత ఖర్చుతో రిపేర్ వర్క్ చేయడం జరిగింది, కాగా అనేక మంది పాదచారులు, స్థానికులు జేడీ ఫౌండేషన్ కృషిని ప్రశంసించారు.

అండగా నిలుస్తున్న “జేడీఫౌండేషన్ “

కరోనా నేపథ్యంలో అత్యవసర సమయాల్లో అండగా నిలుస్తున్న “జేడీఫౌండేషన్”,  నిరంతరం సేవలు అందిస్తున్నఆక్సిజన్ బ్యాంక్ నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సాయం.  భద్రాచలం కొత్తపేట కి చెందిన శ్రీ రావుల హరినాథ్ (73) గారికి శ్వాస ఇబ్బందులు ఎదురవడం తో ఆక్సిజన్ కాంసెంట్రేటర్ అందించారు.

loader