21-02-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న కార్యక్రమంగా వాడేసిన ప్లాస్టిక్ పెట్ బాటిల్స్‌తో ట్రీ గార్డును తయారు చేసి, గతంలో నాటిన మొక్కకు ఏర్పాటు చేయడం జరిగింది.
జేడీ ఫౌండేషన్ గతంలో నాటిన వందలాది మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకుని, వాటి అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తూ, మొక్కలను రక్షించే విధంగా ట్రీ గార్డులను రూపొందించడం ప్రత్యేకతగా నిలిచింది.
మొక్కల సంరక్షణ కోసం జీవీఎంసీ వారు ట్రీ గార్డ్స్‌ను సమకూర్చాలని ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావచ్చని సభ్యులు తెలిపారు.
