జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా విశాఖపట్నం నగరంలోని చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు, ఎండలు మరియు వానల కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నచిన్న వ్యాపారులు — కొబ్బరికాయలు, కుండలు, కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులకు — అవసరమైన సాయంగా ఈ గొడుగులు అందజేయడం జరిగింది.
ఈ గొడుగుల పంపిణీ కార్యక్రమం యల్లపువానిపాలెం, చంద్రానగర్, కొత్తపాలెం, గోపాలపట్నం తదితర ప్రాంతాలలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జేడీ గ్రూప్ సభ్యులు, స్థానిక పెద్దలు, మరియు సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం వల్ల తమకు చాలా ఉపశమనం కలిగిందని చిరు వ్యాపారులు అభిప్రాయపడ్డారు. జేడీ ఫౌండేషన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






