మిoది గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాడేసిన పెన్నుల సేకరణ

07-02-2026: మిoది గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లు నిండడంతో ఈ రోజు వాటిని తెరిచి అందులో ఉన్న వాడేసిన ప్లాస్టిక్ పెన్నులను సేకరించడం జరిగింది.

పాఠశాలలో విద్యార్థులు డ్రాప్ బాక్స్‌లను చురుకుగా వినియోగించడం వల్ల తక్కువ సమయంలోనే అవి నిండడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది. వాడిన పెన్నులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఒకేచోట సేకరించడం ద్వారా పాఠశాల పరిసరాలు మరింత పరిశుభ్రంగా మారాయి.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే కాకుండా, బాధ్యతాయుతమైన అలవాట్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎంత ముఖ్యమో ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది.

భవిష్యత్తులో కూడా ఇలాంటి సేకరణ కార్యక్రమాలను కొనసాగిస్తూ మరిన్ని పాఠశాలల్లో అమలు చేయాలని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థులు ఇదే ఉత్సాహంతో ముందుకు కూడా పాల్గొనాలని ప్రోత్సహించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader