04-01-2026: రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే లక్ష్యంతో జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం నూతన సంవత్సరంలో ఒక చిన్న కానీ ప్రభావవంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిరోజూ వాడిన పెన్నులను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో పడవేయడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా ఒక కలెక్షన్ బాక్స్ ఏర్పాటు చేసి, వాడిన పెన్నులను అందులో వేయించే విధంగా అవగాహన కల్పించనున్నారు.
ఈ విధంగా పెన్నులను సేకరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, డబ్బా నిండిన తర్వాత జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్ అర్ అర్ సెంటర్లలో అందజేస్తే తగిన పైకము కూడా పొందవచ్చు. ఇలా చేయడం వల్ల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు పునర్వినియోగానికి మార్గం సుగమమవుతుంది.
“చిన్న ప్రయత్నం – పెద్ద ప్రయోజనం” అనే భావనతో జేడీ ఫౌండేషన్ సభ్యులు రీ-యూస్ మెటీరియల్స్‌తో తయారు చేసిన ప్రత్యేక కలెక్షన్ బాక్సులను త్వరలో కొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు.

విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మరియు బాధ్యతాయుతమైన వ్యర్థ నిర్వహణకు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
06-01-2026: కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెన్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు
ఈ రోజు స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “స్టాప్ ల్యాండ్ ఫిల్ – డ్రాప్ యూజ్డ్ పెన్స్ హియర్” పేరిట ప్రత్యేక పెన్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయడం జరిగింది.



వాడేసిన పెన్నులను బహిరంగ ప్రదేశాలలో పడవేయడం వలన పర్యావరణానికి, మానవాళి మనుగడకు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నందున వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని విద్యార్థులకు సూచించారు. డబ్బా నిండిన తరువాత వాటిని జీవీఎంసీ ఆర్ ఆర్ ఆర్ సెంటర్లలో అందజేయవచ్చని వివరించారు.
ఉదయం ప్రేయర్ సమయంలో విద్యార్థులకు ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, “చిన్న ప్రయత్నం – పెద్ద ప్రయోజనం” అనే సందేశాన్ని అందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి విద్యార్థి బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రత్నామాల గారు, ఇతర ఉపాధ్యాయులు మరియు జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.



09-01-2026: గాజువాక రవీంద్ర భారతీ పాఠశాలలో పెన్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు
ఈ రోజు గాజువాకలోని రవీంద్ర భారతీ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “స్టాప్ ల్యాండ్ ఫిల్ – డ్రాప్ యూజ్డ్ పెన్స్ హియర్” పేరిట పెన్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
వాడేసిన పెన్నులను బహిరంగ ప్రదేశాలలో పడవేయడం వలన పర్యావరణానికి మరియు మానవాళి మనుగడకు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నందున, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని సూచించారు. డబ్బా నిండిన తరువాత జీవీఎంసీ ఆర్ ఆర్ ఆర్ సెంటర్లలో లేదా జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులకు అందజేయాలని స్కూల్ యాజమాన్యానికి తెలియజేశారు.
ఉదయం ప్రేయర్ సమయంలో విద్యార్థులకు ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద మార్పు సాధ్యమని చైతన్యం కల్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు కూడా పెన్ డ్రాప్ బాక్సులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి కవిత గారు, ఇతర ఉపాధ్యాయులు మరియు జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు ఆదిల్ గారు పాల్గొన్నారు.


12-01-2026: మల్కాపురం పి ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం స్కూల్ ప్రాంగణంలో పెన్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు
ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్కాపురం పి ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం స్కూల్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా “స్టాప్ ల్యాండ్ ఫిల్ – డ్రాప్ యూజ్డ్ పెన్స్ హియర్” పెన్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్న సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జేడీ గ్రూప్ సభ్యులు ఆదిల్ గారు వాడిన పెన్నులను బయట పడవేయడం వలన పర్యావరణానికి కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో పెన్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేసి, విద్యార్థులతో వాడేసిన పెన్నులను బాక్సులో వేయించారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ సత్యజీత్ మిశ్రా గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో తమ విద్యార్థులను భాగస్వామ్యులుగా చేయడం పట్ల జేడీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ లైబ్రేరియన్ శ్రీ ఆర్. జగన్ మోహన్ గారు, ఇతర సిబ్బంది మరియు జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.


23-01-2026: గాజువాక చైతన్య డిగ్రీ & పీజీ మహిళా కళాశాలలో పెన్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు
ఈ రోజు గాజువాకలోని చైతన్య డిగ్రీ & పీజీ మహిళా కళాశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “స్టాప్ ల్యాండ్ ఫిల్ – డ్రాప్ యూజ్డ్ పెన్స్ హియర్” పేరిట పెన్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
వాడేసిన పెన్నులను బహిరంగ ప్రదేశాలలో పడవేయడం వలన పర్యావరణానికి మరియు మానవాళి మనుగడకు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నందున, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని కళాశాల యాజమాన్యానికి మరియు విద్యార్థులకు సూచించారు. డబ్బా నిండిన తరువాత జీవీఎంసీ ఆర్ ఆర్ ఆర్ సెంటర్లలో లేదా జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులకు అందజేయవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద మార్పు సాధ్యమని తెలియజేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పించారు. నగరంలోని ఇతర పాఠశాలలు మరియు కళాశాలలకు కూడా పెన్ డ్రాప్ బాక్సులను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు మరియు జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు ఆదిల్ గారు పాల్గొన్నారు.
30-01-2026: గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పెన్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు
జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా “స్టాప్ ల్యాండ్ ఫిల్ – డ్రాప్ యూజ్డ్ పెన్స్ హియర్” పెన్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతిరోజూ వందల కొద్దీ వాడుతున్న ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కరగక పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నేపథ్యంలో, విద్యార్థినులు చిన్న ప్రయత్నం చేయాలని ప్రధానోపాధ్యాయిని శ్రీమతి వై. స్వర్ణలత గారు సూచించారు. వాడిన పెన్నులను బయట పడేయకుండా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ఈ చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద మార్పు సాధ్యమని, విశాఖ మహానగరంలోని వివిధ పాఠశాలల్లో ఇప్పటికే పెన్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న వాడేసిన పెన్నులను విద్యార్థినులు స్వయంగా సేకరించి డ్రాప్ బాక్సులో వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.





