వెంకటాపురం పాఠశాలలో పొలంబడి కార్యక్రమం

01-02-2026: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనందపురం మండలం, వెంకటాపురం గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పొలంబడి కార్యక్రమం నిర్వహించబడింది.


01-02-2026: నేల సిద్ధం

ఈ కార్యక్రమానికి భాగంగా మొదటి రోజు విద్యార్థులు పొలంబడి కార్యక్రమానికి అవసరమైన నేలను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు భూమిని శుభ్రపరచి, మొక్కలు నాటేందుకు అనువుగా తయారు చేయడం జరిగింది.

ఈ దశలో విద్యార్థులకు వ్యవసాయం ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్ర గురించి అవగాహన కల్పించడం జరిగింది.


03-02-2026: పొలంబడి నిర్వహణ

ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగ, టమాటో, కాలిఫ్లవర్, మిరప వంటి కూరగాయ మొక్కలతో పాటు తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల విత్తనాలను నాటించడం జరిగింది.

ముందుగా విద్యార్థులకు మొక్కల పెంపకం, వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి, అనంతరం వారి చేతుల మీదుగా మొక్కలు నాటించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ ఎం మజ్జి ఈశ్వరరావు గారు మాట్లాడుతూ, విద్యార్థులచే ఈ మొక్కల సంరక్షణ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయులు జి. కృష్ణ గారు, ఎంవిఎస్ ప్రసాదరావు గారు, విమలా రాణి గారు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల మక్కువ పెంపొందించడంతో పాటు, స్వయంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే అలవాటు పెంపొందించబడింది. చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా మంచి భవిష్యత్తు నిర్మాణానికి ఇది దోహదపడుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader