వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, నారక్కపేట్ గ్రామం ప్రాధమిక పాఠశాలలో విలువల బడి ప్రారంభం

07-04-2025: ఈ రోజు నర్సంపేట మండలం నారక్కపేట్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో
జెడి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో “విలువల బడి” కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జెడి ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కవితారెడ్డి గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సదానందం గారు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ నోటుపుస్తకాలు, ఫ్రూట్స్ అందించడం జరిగింది. విలువలబడి కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు జరుగును. ఈ సమయంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించబడును. ప్రతిరోజు స్నాక్స్ అందించబడతాయి. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు నీతి కథలు దేశభక్తి గేయాలు సూక్తులు మరియు ఇంగ్లీష్ పదాలు గణితంలో ప్రాథమిక అంశాలను నేర్పబడును. వారానికి ఒకసారి పిల్లలతో ఒక నీతి కథను నాటికగా ప్రదర్శింపబడును. పిల్లలు వాళ్ళ జుట్టు సరిగా దువ్వుకుంటున్నారా, సరిగా కటింగ్ చేసుకుంటున్నారా, మరియు వాళ్ల గోర్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారా, సరిగా గోర్లు కత్తిరించుకుంటున్నారా గమనించబడును. డిక్షనరీ ఏ విధంగా ఉపయోగించాలో తెలుపబడును. మూడు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయబడును. అలాగే నులిపురుగుల మందులు అందించబడును, అని జేడీ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కవితా రెడ్డి గారు తెలియజేశారు.

ప్రధాన అతిథులు:

కవితా రెడ్డి గారు (జెడి ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్)

జి.సదానందం గారు (పాఠశాల ప్రధానోపాధ్యాయులు)

పాల్గొన్నవారు: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు.

పిల్లలకు పంపిణీ: నోటుపుస్తకాలు, పండ్లు, స్నాక్స్.


16-04-2025: జేడీ ఫౌండేషన్ నిధులతో ముత్యాలమ్మ పాలెంలో స్థాపించిన విలువలబడిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని
వి. వైష్ణవి సృజనాత్మక వికాసంలో భాగంగా విలువలబడి లోగోను పెన్సిల్తో వేసిన చిత్రాలు. [Insert image of the artwork here]

“విలువల బడి” కార్యక్రమం ద్వారా పిల్లలలో నైతికత, విద్యా దక్షత, ఆరోగ్యపరమైన అలవాట్లు రూపుదిద్దేలా చేస్తున్నాము. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలంటే, మమ్మల్ని సంప్రదించండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader