పర్యావరణ పరిరక్షణలో భాగంగా, జేడీ ఫౌండేషన్ నిధులతో విశాఖపట్నం నగరంలోని రెండు కీలక పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం విజయవంతంగా చేపట్టబడింది. ఈ నిర్మాణాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాజువాక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పరిధిలో జరిగాయి.
గాజువాక స్కూల్ కార్యక్రమం:
గాజువాక హై స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి, శ్రీమతి ప్రశాంతి గారికి మరో ముఖ్యమైన పత్రికగా ఇంకుడుగుంతల చిత్రాలతో కూడిన బుక్లెట్ అందజేయడం జరిగింది. ఇది విద్యార్థుల్లో నీటి పరిరక్షణపై అవగాహన పెంచే దిశగా కీలక అడుగు.
నడుపూరు స్కూల్ కార్యక్రమం:
అనంతరం నడుపూరు స్కూల్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, “ఈ రోజుల్లో భూగర్భ జలాలు దెబ్బతింటున్న దశలో, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరం. ఈ కార్యక్రమాన్ని మాకు అందించిన శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
ఈ సందర్భంగా స్కూల్ టీచర్లు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొని విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ ప్రయత్నం భవిష్యత్ తరాలకు నీటి సంరక్షణ అనే విలువను బోధించడానికి మార్గం ఏర్పరచనిది.


