Environment Activities

విత్తనాల సేకరణ

31-05-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న విత్తన బంతుల (Seed Balls) కార్యక్రమం కోసం వివిధ రకాల విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి మరియు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అవసరమైన విత్తనాలను గ్రూప్ సభ్యులు సేకరించారు. ఈ సందర్భంగా గంగరావి, బాదం, టూబాబియా, ఆముదం తదితర వృక్షాల విత్తనాలను సేకరించి, వాటిని విత్తన బంతుల తయారీకి సిద్ధం చేశారు. వర్షాకాలంలో ఈ విత్తన బంతులను వివిధ ప్రాంతాల్లో …

విత్తనాల సేకరణ Read More »

ఆపరేషన్ క్లీన్ స్వీప్

25-05-2026: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక 89వ వార్డు ఆదర్శనగర్ ప్రాంతంలో విస్తృత స్థాయి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆదర్శనగర్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు మరియు ఇతర చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా …

ఆపరేషన్ క్లీన్ స్వీప్ Read More »

పక్షులకు మట్టి నీటి తొట్టెలు, వరి కంకులు ఏర్పాటు

23-05-2026: వేసవి కాలంలో పక్షుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నేషనల్ హైవే అక్కయ్యపాలెం బస్ స్టాప్ (పోర్టు హాస్పిటల్ ఎదురుగా) నుండి ఎన్‌ఏడీ వరకు ఉన్న పబ్లిక్ పార్కుల్లో పక్షుల కోసం మట్టి నీటి తొట్టెలు ఏర్పాటు చేసి, వరి కంకులను కట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులకు విచ్చేసిన సందర్శకులకు వేసవి కాలంలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు …

పక్షులకు మట్టి నీటి తొట్టెలు, వరి కంకులు ఏర్పాటు Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలఏళ్ల నాటి బావిలో పూడిక తీసివేత

19-05-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నంలోని స్థానిక 89వ వార్డు, యల్లపువానిపాలెం, యల్లపువారి వీధి వద్ద ఉన్న వందల ఏళ్ల నాటి పెద్ద బావిలో పూడిక తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బావిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, గాజు సీసాలు మరియు ఇతర వ్యర్థాలను పని చేసే సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు, జేడీ ఫౌండేషన్ సభ్యులు కలిసి తొలగించారు. బావిని శుభ్రపరచడం ద్వారా భూగర్భ జలాల నిల్వ …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలఏళ్ల నాటి బావిలో పూడిక తీసివేత Read More »

మన చెరువు మన బాధ్యత

16-05-2026: పర్యావరణ పరిరక్షణ మరియు నీటి వనరుల సంరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ నరసింహా యువజన రజక సేవా సంఘం సహకారంతో గోపాలపట్నం హైస్కూల్ గేట్ సమీపంలోని రజక కాలనీ చెరువు వద్ద “మన చెరువు – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి, చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు మరియు ఇతర చెత్తను పెద్ద ఎత్తున తొలగించారు. చెరువును పరిశుభ్రంగా ఉంచడం …

మన చెరువు మన బాధ్యత Read More »

వంద సంవత్సరాల మామిడి వృక్షానికి సంరక్షణ చర్యలు

07-05-2026: గోపాలపట్నం బాలికొన్నత పాఠశాల ఆవరణలో ఉన్న సుమారు వంద సంవత్సరాల నాటి మామిడి వృక్షాన్ని సంరక్షించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, డై బ్యాక్ (Die Back) తెగులు సోకిన ఈ చారిత్రక వృక్షాన్ని కాపాడేందుకు నిపుణుల సూచనల మేరకు సహజసిద్ధమైన పద్ధతులతో దశలవారీగా సంరక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. వృక్షం ఆరోగ్యాన్ని పునరుద్ధరించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 02-05-2026: డై బ్యాక్ తెగులు సోకిన శత వయస్సు గల మామిడి వృక్షానికి సంరక్షణ …

వంద సంవత్సరాల మామిడి వృక్షానికి సంరక్షణ చర్యలు Read More »

“జలమే జీవం” పోస్టర్ ఆవిష్కరణ

05-05-2026: విశాఖ మహానగరంలో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమానికి మద్దతుగా నగరవాసుల్లో అవగాహన కల్పించేందుకు జేడీ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా “వర్షపు నీటిని ఒడిసి పట్టుదాం – ఇంకుడు గుంతలు నిర్మిద్దాం – భూగర్భ జలాలను పెంపొందిద్దాం” అనే సందేశాలతో రూపొందించిన అవగాహన పోస్టర్లను విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం. విశ్వేశ్వర …

“జలమే జీవం” పోస్టర్ ఆవిష్కరణ Read More »

గోపాలపట్నం ఆదిత్య డిగ్రీ కాలేజీలో వాడిన పెన్నుల సేకరణ

02-05-2026: పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో భాగంగా, గోపాలపట్నంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లను ఈ రోజు తెరిచి, విద్యార్థులు ఉపయోగించి పారవేసిన పెన్నులను సేకరించారు. గత నెలలో విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే లక్ష్యంతో కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా పెన్ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు మంచి స్పందనతో వాటిని వినియోగించి, వాడిన పెన్నులను అందులో వేసి ఈ కార్యక్రమానికి …

గోపాలపట్నం ఆదిత్య డిగ్రీ కాలేజీలో వాడిన పెన్నుల సేకరణ Read More »

ఫౌండేషన్ సభ్యులు తయారు చేసిన వాటర్ డ్రమ్

26-04-2026: వేసవి కాలంలో మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ జేడీ ఫౌండేషన్ సభ్యులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. గతంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు మండు వేసవి ప్రభావం వల్ల నీటి అవసరం పెరగడంతో, వాటికి సులభంగా నీటిని అందించేందుకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా వాటర్ డ్రమ్ తయారు చేశారు. ఈ రోజు ఆ వాటర్ డ్రమ్‌ల సహాయంతో వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలకు నీటిని అందించడం జరిగింది. దీంతో ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నీటిని తీసుకెళ్లి …

ఫౌండేషన్ సభ్యులు తయారు చేసిన వాటర్ డ్రమ్ Read More »

ఏపుగా పెరుగుతున్న మొక్కలు

18-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ నెలలో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీ ప్రాంగణంలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గత సంవత్సరం చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమం ఫలితంగా నాటిన మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి, పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ రోజు అవి బలంగా పెరిగి నీడను అందించే …

ఏపుగా పెరుగుతున్న మొక్కలు Read More »

loader