పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ తీసుకున్న మరో వినూత్న కార్యక్రమం — “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత”. ఈ పిలుపుకు విశాఖపట్నంలో విశేషమైన స్పందన లభిస్తోంది.
ఈ రోజు, 89వ వార్డు యల్లపువానిపాలెం సంతోష్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఉన్నతాధికారి శ్రీ దాడి వెంకట అప్పారావు గారి ఇంటి ఆవరణలో జేడీ ఫౌండేషన్ సభ్యుల సూచన మేరకు ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యులు గుడ్డ సంచులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫౌండేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ చర్య భూగర్భ జలాల పరిరక్షణకు మరియు వర్షపు నీటి సమర్థ వినియోగానికి మార్గం కల్పిస్తోంది.


